ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా పాలనలో అరాచకాలను పోలీసులు అడ్డుకోవాలి: ఆలపాటి - తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ న్యూస్

వైకాపా పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని తెదేపా నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. యలమంద నాయక్​ను అరెస్టు చేసిన సమయంలో దారుణంగా కొట్టారని ఆరోపించారు. వర్ల రామయ్యతో కలిసి యలమంద నాయక్​ను తీసుకొని గ్రామీణ ఎస్పీని కలిశారు.

yalamanda-nayak
yalamanda-nayak

By

Published : Nov 17, 2020, 12:38 PM IST

వైకాపా ప్రభుత్వం వచ్చాక అరాచకం పెరిగిపోయిందని.. తెదేపా కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయని.. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. వీటిని అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని డిమాండ్ చేశారు. మాచవరం మండలం చెన్నాయపాలెేనికి చెందిన యలమంద నాయక్​ను అరెస్టు చేసిన సమయంలో దారుణంగా కొట్టారని.. ఆరోపించారు.

వర్ల రామయ్యతో కలిసి యలమంద నాయక్​ను తీసుకొని గ్రామీణ ఎస్పీని ఆలపాటి రాజేంద్రప్రసాద్ కలిశారు. యలమంద నాయక్​పై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని.. వారి పై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు కోరారు. మాచవరం స్టేషన్ నుంచి మాచర్ల దాకా రక్తం వచ్చేట్లు సివిల్ డ్రస్​లో ఉన్న పోలీసులు కొట్టారని.. ఆ సమయంలో ఎస్సై కాపాడకపోతే.. తన ప్రాణాలు పోయేవని యలమంద నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సై రక్షించారన్న కృతజ్ఞతతో జరిగిన విషయాన్ని మేజిస్ట్రేట్​కు చెప్పలేదని యలమంద నాయక్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details