Situation Of Krishna West Delta Canals : ప్రకాశం బ్యారేజి నుంచి కాలువల ద్వారా విడుదలయ్యే నీటితో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో సాగయ్యే ఆయకట్టుని కృష్ణా పశ్చిమ డెల్టాగా వ్యవహరిస్తారు. బ్యారేజి కుడి వైపు నుంచి వచ్చే ప్రధాన కాలువతో పాటు గుంటూరు ఛానల్ ద్వారా సాగునీరు సరఫరా అవుతుంది. ప్రధాన కాలువ దుగ్గిరాల వరకూ వచ్చి అక్కడి నుంచి హైలెవల్ ఛానల్, తూర్పుకాల్వ, నిజాంపట్నం కాల్వ, పశ్చిమ కాల్వ, కృష్ణా పశ్చిమ కాలువ, కొమ్మమూరు కాల్వలుగా విడిపోతుంది.
కాలువ మరమ్మతులు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం : గుంటూరు ఛానల్ ప్రకాశం బ్యారేజి వద్ద మొదలై వట్టి చెరుకూరు మండలం గారపాడు వరకు ప్రవహిస్తుంది. ఈ కాలువల ద్వారా వచ్చే నీరే 2జిల్లాల్లోని 5లక్షల 72 వేల ఎకరాల సాగుకు ఆధారం. ఏటా జూన్‌లో కాలువలకు నీరు విడుదల చేస్తారు. దీనికి ముందే కాలువలు, షట్టర్లను సిద్ధం చేయాల్సి ఉంటుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాది కూడా కాలువల మరమ్మతులే చేయలేదు. గేట్లు తుప్పుపట్టి పాడైపోయాయి. గేట్లు మూసేసినా లీకేజిల రూపంలో బయటకు వస్తున్నాయి.
ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి :దుగ్గిరాల, కొల్లూరు లాకులు మరీ శిథిలావస్థకుచేరాయి.గేట్లుతుప్పుపట్టడంతో తాళ్లతో కట్టేశారు. కొమ్మమూరు కాలువ అధ్వానంగా తయారైంది. 2008లో 410కోట్లతో ఆధునికీకరణ పనులు తలపెట్టినా 30కోట్ల విలువైనా పనులైనా పూర్తి కాకుండా అర్ధాంతరంగా ఆపేశారు. అప్పట్నుంచి తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. ఫలితంగా బాపట్ల, రేపల్లె, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో చివరి ఆయకట్టుకు సాగునీరందని పరిస్థితి.