పర్యావరణ సమతుల్యత సక్రమంగా ఉండాలంటే పులుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి లతీఫ్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరులోని రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయంలో వెబినార్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లతీఫ్కుమార్ మాట్లాడుతూ.. పులుల సంరక్షణ, మానవ మనుగడ పరస్పరం ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. దేశంలో పులులను సంరక్షించడం ద్వారా అటవీ సంపద పదిలంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో పులుల సంరక్షణకు బలమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో ప్రస్తుతం 60 పులులున్నాయని...,వాటి ఛాయాచిత్రాలు కూడా అటవీ శాఖ వద్ద ఉన్నాయన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వు ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వు ప్రాజెక్టని లతీఫ్ కుమార్ వెల్లడించారు.
'పులులను సంరక్షించడం ద్వారా అటవీ సంపద పదిలం' - అంతర్జాతీయ పులుల దినోత్సవం
పులుల సంరక్షణకు బలమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామని రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి లతీఫ్ కుమార్ స్పష్టం చేశారు. పులుల సంరక్షణ, మానవ మనుగడ పరస్పరం ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన సూచించారు.
'పులులను సంరక్షించడం ద్వారా అటవీ సంపద పదిలం'