ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం జగన్‌తో ప్రపంచబ్యాంకు ప్రతినిధుల భేటీ

By

Published : Feb 25, 2020, 12:43 PM IST

Updated : Feb 25, 2020, 8:00 PM IST

విద్య, వైద్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న సంస్కరణలు, పథకాలను సీఎం జగన్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు వీలుగా నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిపారు. పాలన వికేంద్రీకరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలనూ వివరించారు. సామాజిక భద్రతా అంశాల్లో ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు.

World Bank representatives meet with CM Jagan
సీఎం జగన్‌తో ప్రపంచబ్యాంకు ప్రతినిధుల భేటీ

సీఎం జగన్‌తో ప్రపంచబ్యాంకు ప్రతినిధుల భేటీ

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మెరుగైన సంస్కరణల్ని ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం జగన్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. స్థానిక యువతకు మెరుగైన నైపుణ్యాభివృద్ధి కల్పించటం సహా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సచివాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం జగన్​ సమావేశమయ్యారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. వచ్చే మూడేళ్లలో భూముల రిజిస్ట్రేషన్‌ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే నిర్వహిస్తామన్నారు.

అన్ని ప్రాంతాలకూ సమన్యాయమే లక్ష్యం

అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకు రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై శాసన సభలో నిర్ణయం తీసుకున్నట్లు వరల్డ్‌ బ్యాంక్‌ బృందానికి సీఎం తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. విశాఖ ఒక్కటే అన్ని సదుపాయాలూ ఉన్న నగరమని సీఎం అన్నారు. పరిమిత స్థాయిలో నిధులు వెచ్చిస్తే నగర స్థాయి మరింతగా పెరుగుతుందన్నారు.

ప్రభుత్వ చర్యలు స్ఫూర్తిదాయకం

ఆరోగ్యం, విద్య, సహా పలు రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు స్ఫూర్తిదాయకమని ప్రపంచబ్యాంకు బృందం అభినందించింది. విద్య, వైద్యం, సామాజిక భద్రత అంశాల్లో ప్రభుత్వానికి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టరేట్లు, సచివాలయానికి అనుసంధానించడం ఈ – పరిపాలనను మరింత వేగవంతం చేస్తోందని.. సమాచారాన్ని సచివాలయాలకు అందుబాటులో ఉంచడం చక్కటి ఫలితాలను ఇస్తోందని ప్రపంచబ్యాంకు బృందం పేర్కొంది. వచ్చే 4 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేసి.... ఏయే కార్యక్రమాలకు ప్రపంచబ్యాంకు నుంచి సహాయం అందించాలన్న విషయంపై ఒక అవగాహనకు వస్తామని ప్రతినిధి బృందం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్

Last Updated : Feb 25, 2020, 8:00 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details