ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NADU-NEDU: కదలని ‘నాడు-నేడు’.. చెట్లకిందే ఈ ఏడూ - గుంటూరు జిల్లా తాజా వార్తలు

NADU-NEDU: రాష్ట్రవ్యాప్తంగా జులై 4న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ‘నాడు-నేడు’ పథకానికి ఎంపిక చేసిన పలు బడుల్లో మాత్రం పనులు టెండర్ల దశలోనే ఉన్నాయి.

NADU-NEDU
NADU-NEDU

By

Published : Jun 20, 2022, 9:14 AM IST

NADU-NEDU:రాష్ట్రవ్యాప్తంగా జులై 4న పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ‘నాడు-నేడు’ పథకానికి ఎంపిక చేసిన పలు బడుల్లో మాత్రం పనులు టెండర్ల దశలోనే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పేరొందిన ఎస్‌కేబీఎం మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి కనీసం పునాదులూ తీయలేదు. 1200 మంది విద్యార్థులున్న ఈ బడిలో ప్రస్తుతం 15 తరగతి గదులే ఉన్నాయి. దీంతో సగం మంది విద్యార్థులు చెట్ల కిందే కూర్చుంటున్నారు. ఈ పరిస్థితి చూసి అధికారులు పాఠశాలను ‘నాడు-నేడు’ రెండో విడత కింద ఎంపిక చేశారు. రూ.1.68 కోట్లతో బడి ఆవరణలో 14 అదనపు తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించారు. కానీ, ఇంతవరకు పునాదులే తీయలేదు. టెండర్లలో జాప్యం, ప్రణాళికా లోపంతో పనులు ముందుకు సాగలేదని తెలిసింది. ఫలితంగా.. ఏళ్లుగా చెట్ల కిందే పాఠాలు వింటున్న విద్యార్థులకు ఈ సారీ ఆ బాధలు తప్పేలా లేవు.

ABOUT THE AUTHOR

...view details