ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిమెంట్ కర్మాగారంలో కార్మికుడు మృతి - deaths in pedagarlapadu news

గుంటూరు జిల్లా పెదగార్లపాడులోని ఓ సిమెంట్ కంపెనీలో పని చేస్తున్న కార్మికుడు కొత్త శ్రీనివాసరావు(25).. ప్రమాదవశాత్తు మరణించాడు. మృతదేహాన్ని చూపించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని అతని బంధువులు ఆందోళన చేస్తున్నారు.

protest
కుటుంబ సభ్యుల ఆందోళన

By

Published : Jan 16, 2021, 2:57 PM IST

దాచేపల్లి పెదగార్లపాడులోని ఓ సిమెంట్ కర్మాగారంలో పని చేసే కార్మికుడు కొత్త శ్రీనివాసరావు(25) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా శుభ్రం చేస్తున్న సమయంలో బెల్ట్​లో పడి మరణించాడు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కర్మాగారం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మృతదేహాన్ని చూపించాలని, తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాలనాగిరెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details