ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ మంచి మనసు... గంగిరెద్దుకు గాయం కాకూడదని.. - cm jagan latest news

గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరిగిన గోపూజ కార్యక్రమంలో సీఎం చేసిన పని అందరినీ ఆకర్షించింది. తన ముందు ఆడుతోన్న గంగిరెద్దుకు గాయం కాకుండా ఆపారు ముఖ్యమంత్రి.

CM JAGAN
CM JAGAN

By

Published : Jan 15, 2021, 7:43 PM IST

Updated : Jan 15, 2021, 7:56 PM IST

సీఎం జగన్ మంచి మనసు... గంగిరెద్దుకు దెబ్బ తగలకూడదని..

గుంటూరు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరిగిన గోపూజ కార్యక్రమంలో ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. మున్సిపల్ స్టేడియం ప్రాంగణంలో జరిగిన ఈ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో గంగిరెద్దులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సీఎం రాగానే గంగిరెద్దు తన యజమాని చెప్పినట్లు ఆడుతోంది. ఆ సమయంలో పక్కనే బారికేడింగ్ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీ గంగిరెద్దు మెడకు తగులుతోంది. వెంటనే గమనించిన ముఖ్యమంత్రి గంగిరెద్దు మెడకు గాయమవుతుందనే ఉద్దేశంతో ఇనుప కడ్డీపై తన చేయి ఉంచారు. ఆ తర్వాత గంగిరెద్దు యజమానికి చెప్పి దాన్ని కొంచెం పక్కకు తప్పించారు. ఆ తర్వాత గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి సంప్రదాయ పంచకట్టు, కండువాతో హాజరయ్యారు. వేద మంత్రాల నడుమ గో మాతకు, దూడకు పట్టు వస్త్రాలు, పూలమాలలు, పసుపు కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. వాటి చుట్టూ ప్రదక్షిణ చేశారు.

Last Updated : Jan 15, 2021, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details