పరిపాలన రాజధానిగా అమరావతే కొనసాగేలా చూడాలంటూ.. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో మహిళలు గంగానమ్మ తల్లికి పొంగళ్లు సమర్పించారు. అనంతరం నినాదాలు చేశారు. 264 రోజులుగా వివిధ రకాల ఆందోళన చేస్తున్నామని తెలిపారు.
తమ ఆందోళనలకు విఘాతం కలగకుండా న్యాయస్థానాలలో విజయం సాధించాలని కోరుతూ గ్రామ దేవతకు పొంగళ్ళు సమర్పించామని చెప్పారు. తామంతా భూములు కోల్పోయి తీవ్ర మనోవేదనతో ఉన్నామని కన్నీటిపర్యంతమయ్యారు.