గుంటూరు జిల్లా కాకునూరు మండలం చినలింగాయపాలెంలో మద్యం దుకాణం తెరవడంపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్, ఆరెంజ్జోన్లలో ఉన్న వారు మద్యం కొనుగోలుకు రావడంతో ఆందోళన చెందారు. ఇంతమంది గ్రామంలోకి వస్తే...కరోనా ఎందుకు రాదని పోలీసులను నిలదీశారు. మహిళల నిరసనతో పోలీసులు మద్యం దుకాణాన్ని మూసి వేయించారు. రేపు యథావిధిగా మద్యం దుకాణం తెరుస్తామని అధికారులు చెప్పారు.
మద్యం దుకాణాలు తెరవడంపై మహిళల ఆందోళన - గుంటూరు జిల్లా వార్తలు
మద్యం దుకాణాలు తెరచి ఎవరి ప్రాణాలు పోగొట్టాలని చూస్తున్నారంటూ గుంటూరు జిల్లా చినలింగాయపాలెంలో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో గ్రామాల్లో ఆందోళన చెందుతుంటే ఇప్పుడు మద్యం దుకాణాలు తెరిచి వైరస్ ప్రబలడానికి దారులు చూపుతున్నారని మహిళలు ఆరోపించారు.
మద్యం దుకాణాలు తెరవడంపై మహిళల ఆందోళన