ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రక్తపు మడుగులో మహిళ మృతదేహం.. ఏం జరిగిందంటే.. - guntur latest news

ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో రక్తపుమడుగులో మృతి చెందిన ఘటన తెనాలి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరడైజ్ అపార్ట్ మెంట్లో జరిగింది. తలపై బలమైన గాయాలుతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని సీఐ బి. కోటేశ్వరరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

రక్తపు మడుగులో మహిళ మృతదేహం.. ఏం జరిగిందంటే..
రక్తపు మడుగులో మహిళ మృతదేహం.. ఏం జరిగిందంటే..

By

Published : Aug 29, 2021, 2:34 AM IST

గుంటూరు జిల్లా తెనాలి.. బస్టాండ్ సమీపంలోని ప్యారడైజ్ అపార్ట్​మెంట్​లోని ఫ్లాట్ నెంబర్ 306లో తాడికొండ మైథిల(53) అనే మహిళ మృతి చెందింది. పోలీసులు, స్థానికుల వివరాల ఇలా ఉన్నాయి. స్థానిక గంగానమ్మ పేటలో పాన్ బ్రోకర్స్ వ్యాపారం చేస్తున్న బద్రి నారాయణ మూర్తి, మైధిలి(53)కి సంతానం లేకపోవడంతో నవీన్ అనే వ్యక్తిని కొన్నేళ్ల కిందట దత్తత తీసుకున్నారు. అతనికి వివాహం కూడా అయింది.

తలకు గాయాలు.. రక్తపు మడుగులో మృతదేహం

శనివారం రాత్రి దాదాపుగా ఏడున్నర గంటల సమయంలో ఫ్లాట్ నెంబర్ 306 నుంచి పెద్దగా ఏడుపులు వినిపించాయి. తలుపు తెరిచి చూడగా మైధిలి రక్తపుమడుగులో పడి ఉంది. కుమారుడు, భర్తను పోలీసులు విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:Brutal Murder: సత్తెనపల్లిలో దారుణం.. తల్లీకుమార్తెల హత్య

ABOUT THE AUTHOR

...view details