ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళ ఆత్మహత్యాయత్నం.. పంచాయతీ అధికారి వేధింపులే కారణమా..? - Women Sucide Attempt news in guntur district

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పంచాయతీ అధికారి వేధింపుల వల్లే తన తల్లి ఆత్మహత్యకు యత్నించిందని బాధితురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అధికారుల వేధించారంటూ మహిళ ఆత్మహత్యాయత్నం
అధికారుల వేధించారంటూ మహిళ ఆత్మహత్యాయత్నం

By

Published : Jan 30, 2020, 1:18 PM IST

పంచాయతీ అధికారి వేధిస్తున్నారని మహిళ ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో నారసమ్మ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే పంచాయతీ అధికారి వేధింపుల వల్లే తన తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు బాధితురాలి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇదీ జరిగింది

స్థానిక పంచాయతీ స్థలంలో కూరగాయలు విక్రయించుకునే నాసరమ్మ దుకాణాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉందని పంచాయతీ అధికారులు తొలగించారు. దీనిపై ఆమె ఈ నెల 27న జిల్లా కేంద్రంలో స్పందన కార్యక్రమంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే తన తల్లి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినందునే పంచాయతీ అధికారులు వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలి కొడుకు ఆరోపించాడు. మనస్తాపంతోనే తన తల్లి పురుగుల మందు తాగిందని వాపోయాడు. దీనిపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి అరుణ్​కుమార్​.. పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా.. తనను బెదిరిస్తున్నారని తెలిపారు. దీనిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ఇదీ చూడండి:

భార్యతో వివాదం.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య..!

ABOUT THE AUTHOR

...view details