గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో... స్వయం సహాయక సంఘాల గ్రామ సమాఖ్య అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమాదేవిని వార్డు మెంబర్ గా పోటీ చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని గ్రామానికి చెందిన వైకాపా నాయకులు బెదిరించారు. ఫలితంగా రమాదేవి... గ్రామంలోని వైకాపా నేత పావులూరి వాసు ఇంటి వద్ద నిరసన చేపట్టింది. తన కుటుంబానికి ఆధారంగా ఉన్నా ఉద్యోగం పోతే ఆత్మహత్య చేసుకుంటానని వాపోయింది. సమాచారం తెలుసుకున్న యడ్లపాడు ఎస్ఐ శ్రీహరి గ్రామానికి చేరుకుని రమాదేవిని పోలీసు స్టేషన్‌కు తరలించి, వివరాలు నమోదు చేసుకున్నారు.
'ఉద్యోగం నుంచి తీసేస్తే ఆత్మహత్య చేసుకుంటా' - guntur district latest news
పంచాయతీ వార్డు మెంబర్‌గా పోటీ చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామన్న బెదిరింపులకు నిరసనగా... గుంటూరు జిల్లా తిమ్మాపురం గ్రామంలో వైకాపా నేత ఇంటివద్ద బాధితురాలు ధర్నా చేపట్టింది. తమ కుటుంబానికి ఆధారంగా ఉన్న ఉద్యోగం పోతే ఆత్మహత్యే శరణ్యం అని వాపోయింది.
తిమ్మాపురంలో మహిళ ఆందోళన