ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని మహిళల ఆందోళన - woman protest at guntur district latest news

స్థలాలు మంజూరు విషయంలో తమకు అన్యాయం జరిగిందని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో మహిళలో నిరసన చేపట్టారు. అనర్హులకు ఇళ్లు మంజూరు చేసి అర్హులైన తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని మహిళలు పంచాయతీ ఎదుట ఆందోళన చేశారు.

Women protest
ఇళ్ల స్థలాల మంజూరులో మహిళల ఆందోళన

By

Published : Jul 3, 2020, 11:28 AM IST

తమకు ఇళ్ల స్థలాల మంజూరులో అన్యాయం జరిగిందంటూ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులోని పంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు. ఇళ్ల స్థలాల జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపించారు.

తమకు న్యాయం చేయాలని మహిళలు డిమాండ్​ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలకు సద్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు.

ABOUT THE AUTHOR

...view details