ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. 480వ రోజు రైతులు, మహిళలు ఆందోళనలు చేశారు. తుళ్లూరు, మందడం, ఉద్ధండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, వెలగపూడి, అనంతవరం గ్రామాల్లో రైతులు, మహిళలు తమ నిరసన దీక్షలు కొనసాగించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. మందడం గ్రామానికి చెందిన రైతులు అనంతవరం వేంకటేశ్వరస్వామి ఆలయంలో పొంగళ్లు సమర్పించారు. అనంతరం మందడం నుంచి అనంతవరం వరకు గుమ్మడికాయలతో ర్యాలీ నిర్వహించారు.
480వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు - amaravathi latest news
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు, రైతులు చేస్తున్న ఆందోళనలు 480వ రోజు కొనసాగాయి. మందడంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో మహిళలు, రైతులు పొంగళ్లు సమర్పించారు.
అమరావతి రైతుల నిరసనలు