గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరుమాళ్ళ సూర్యకుమారి అనే 45 సంవత్సరాల మహిళ తలమీద నుంచి లారీ కంటైనర్ టైర్ వెళ్ళింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందగా... కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విజయవాడ నుంచి మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలోని తన కుమార్తె వద్దకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సూర్యకుమారి మరణ వార్త విని.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కుమార్తెను చూసొద్దామనుకుంది... అంతలోనే అనంతలోకాలకు - గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు
కుమార్తెను చూసొద్దామని కుమారుడితో బయలుదేరింది. అంతలోనే లారీ రూపంలో మృత్యువుకు బలైంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వద్ద రోడ్డు ప్రమాదం