గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. కోర్నేపాడు గ్రామం నుంచి సమీపంలోని కనపర్రు మేరీమాత మందిరానికి 11మందితో ఆటో బయలుదేరింది. గణపవరం వద్ద ఓ ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేరీ మరియమ్మ(30) మృతిచెందారు. ముగ్గురు చిన్నారులతో సహా 10మందికి గాయాలయ్యాయి. తీవ్రగాయాపాలైన ఆరుగురిని గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. మిగిలినవారికి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను ఢీకొట్టిన బస్సు.. మహిళ మృతి, 10మందికి గాయాలు - నాదెండ్ల రోడ్డుప్రమాదంలో మహిళ మృతి
ప్రార్థన కోసం మేరీమాత మందిరానికి ఆటోలో వెళ్తున్నవారిని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. ముగ్గురు చిన్నారులతో సహా 10మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద జరిగింది.
ఆటోను ఢీకొట్టిన బస్సు