గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో.. మద్యం విక్రయాలు వద్దని వైన్ షాప్ ఎదుట మహిళలు ధర్నా చేశారు. మద్యం దుకాణానికి పక్కనే ఉన్న గ్రామాలు, మండలాల నుంచి ప్రజలు వస్తున్నారని... ఇంతమంది జనం తమ ఊళ్లోకి వస్తే కరోనా వస్తోందని భయపడుతున్నారు. గ్రామంలోని ప్రస్తుత పరిస్థితిని ప్రొవిజినల్ సీఐ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి షాపును ప్రస్తుతం మూసి... ఇబ్బంది లేని చోట మద్యం అమ్మకాలు జరుపుతామని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.
మద్యం అమ్మకాలు వద్దంటూ మహిళల ధర్నా - పిల్లుట్లలో మద్యం దుకాణాలు తెరవద్దంటూ మహిళలు ధర్నా
పక్కనే ఉన్న ఊర్లలోని ప్రజలు.. తమ గ్రామానికి మద్యం కోసం వస్తున్నారంటూ గుంటూరు జిల్లా పిల్లుట్ల గ్రామ మహిళలు.. వైన్ షాపు ఎదుట ధర్నా చేశారు. ప్రజలంతా ఇలా తమ ఊరికి వస్తే కరోనా వచ్చే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
Women dharna for liquor sales in Pillutla village in guntur