ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య - hang

గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మృతికి ఆమె భర్తే కారణమని.. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

suicide
ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య

By

Published : Apr 29, 2021, 3:24 PM IST

ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య

గుంటూరు జిల్లా తెనాలిలోని పాండురంగపేటలో వివాహిత మౌలాబి.. ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడకు చెందిన ఖాసింతో పన్నెండేళ్ల క్రితం మౌలాబికి వివాహం జరిగింది. వీరికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. భార్యను కట్నం తీసుకురమ్మని, ఖాసీం నిత్యం వేధించేవాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వారం రోజులుగా మౌలాబిని కొడుతున్నాడనీ.. అందుకే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు.

అలా అనొద్దని అమ్మకు చెప్పాను:

తమ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతున్నాయని.. అమ్మ ఏడుస్తూ ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోదామని తమతో చెప్పేదనీ.. అలా అనవద్దని, తమకు భయం వేస్తోందని తాను అమ్మతో చెప్పేవాడినంటూ మౌలాబీ కుమారుడు ఏడుస్తూ చెప్పాడు.

ఇదీ చదవండి:వాస్తు శాస్త్ర నిపుణుడు శ్రీశైలనాథ్ అయ్యంగార్ మృతి

ABOUT THE AUTHOR

...view details