ప్రజలను రక్షించాల్సిన పోలీసు అధికారి తన కర్తవ్యాన్ని మరిచి ఓ మహిళ వద్ద డబ్బు వసూలు చేయడంతో పాటు, లైంగిక దాడికి యత్నించాడు. అమరావతి ఎస్‌ఐ తనపై లైంగికదాడికి యత్నించాడని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడిని సస్పెండ్ చేశారు. అమరావతి ఎస్‌ఐ లైంగిక వేధింపుల ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్‌ఐ రామాంజనేయులు, అతడి డ్రైవర్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా విచారణ పూర్తిచేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
'లైంగిక వేధింపులకు పాల్పడిన ఎస్సైను అరెస్ట్ చేయండి' - women commission latest news
అమరావతి ఎస్‌ఐ తనపై లైంగికదాడికి యత్నించాడని ఓ మహిళ గుంటూరు డీఎస్పీని ఆశ్రయించింది. విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్‌ఐ రామాంజనేయులు, అతడి డ్రైవర్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
women commission