విశాఖలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీతమ్మధార బ్రాంచ్ ఉద్యోగులు.. శివోహమ్ ట్రస్ట్, సాయి పూజా ఫౌండేషన్ లకు 10 బియ్యం బస్తాలు (25 కేజీల బ్యాగులు) బ్రాంచ్ ఆవరణలో అందజేశారు. అన్న సంతర్పణకు వినియోగించాలని కోరారు. సాయి పూజా ఫౌండేషన్ ఛైర్మన్ వానపల్లి రవికుమార్, శివోహమ్ ట్రస్ట్ సహాయ కార్యదర్శి ఎస్ మురళి.. బస్తాలను అందుకున్నారు. ఈ బ్రాంచి మొత్తం మహిళా ఉద్యోగులతో నడపుతున్నారు. బ్రాంచ్ సీనియర్ మేనేజర్ టి లావణ్య, సిబ్బంది కె దివ్యజ్యోతి, బి.గౌతమి ప్రియా, పి.రజీత, లక్ష్మి, సంధ్య, మాధవి, వేణి, నిహారిక తదితరులు పాల్గొన్నారు.
బ్యాంక్ ఉద్యోగుల దాతృత్వం.. బియ్యం బస్తాల పంపిణీ - vishaka district
విశాఖలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు.. శివోహమ్ ట్రస్ట్, సాయి పూజా ఫౌండేషన్ లకు 10 బియ్యం బస్తాలు అందజేశారు. ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలు, యాచకులకు భోజనం పంపిణీ నిమిత్తం వినియోగించాలని దాతలు కోరారు.
బియ్యం బస్తాలు అందించిన బ్యాంక్ ఉద్యోగులు