కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టముక్కల గ్రామానికి చెందిన పసల కరిమలమ్మ, ఆమె భర్త రాజారావు... బంధువుల ఇంటికని ఫిరంగిపురం వెళ్లారు. 21వ తేదీన భవనం పైకి ఎక్కిన కరిమలమ్మ... కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడింది.
తలకు తీవ్ర గాయమైన ఆమెను.. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా... చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఏసీఐ సురేష్ తెలిపారు.