గుంటూరు జిల్లా శాఖమూరు అంబేడ్కర్ స్మృతివనంలో అదృశ్యమైన అంబేడ్కర్ విగ్రహాలను ప్రతిష్ఠించాలంటూ... గుంటూరు లాడ్జ్ సెంటర్ వద్ద దళిత, మహిళ ఐకాస ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శాఖమూరులో మాయమైన విగ్రహాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామీణ ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
'అదృశ్యమైన అంబేడ్కర్ విగ్రహాలను పున:ప్రతిష్ఠించాలి' - guntur latest news
గుంటూరు లాడ్జ్ సెంటర్లో దళిత, మహిళ ఐకాస ఆధ్వర్యంలో నిరసన చేశారు. శాఖమూరు స్మృతివనంలో అదృశ్యమైన అంబేడ్కర్ విగ్రహాలను పున:ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు.

గుంటూరులో ఆందోళన