ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలంలో మహిళ దారుణ హత్య - గుంటూరు జిల్లా తాజా క్రైం వార్తలు

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు సమీపంలో మహిళ దారుణ హత్యకు గురైంది. పక్కనే ఓ యువకుడు పురుగుల మందు తాగేసి అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతన్ని పోలీసులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

woman murdered in farm at guntur district
మహిళ దారుణ హత్య

By

Published : May 9, 2020, 2:48 PM IST

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ఏటుకూరు గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి.. దారుణంగా హత్యకు గురైంది. ఆమె మృతదేహం పక్కన కొండపాడు గ్రామానికి చెందిన యువకుడు పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

అతడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ హత్య అతనే చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details