ఆశించిన దిగుబడి రాక.. మహిళా కౌలు రైతు ఆత్మహత్య - గుంటూరు జిల్లా తాజా వార్తలు
పంట నష్టం వాటిల్లిందన్న బాధతో మహిళా కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్య
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడుకు చెందిన మన్నవ రత్నకుమారి (52) ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప పంటలు సాగు చేస్తోంది. గతేడాది ఆశించిన విధంగా దిగుబడి రాకపోవటం....ఈ ఏడాది కూడా అలానే ఉండటంతో అప్పులు ఎక్కువయ్యాయి. కొద్దిరోజులుగా ఈ విషయమై మదనపడుతున్న ఆమె పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.