ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో కలుషితాహారం తిని మహిళ మృతి - Woman dies after eating contaminated food at guntur news

కలుషిత ఆహారం తిని మహిళ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కలుషితాహారంపై విచారణ చేపట్టారు.

Woman dies after eating contaminated food
కలుషిత ఆహారం తిని మహిళ మృతి

By

Published : Sep 30, 2020, 8:35 AM IST

గుంటూరులో కలుషితాహారం తిని మహిళా మృతి చెందింది. పాత గుంటూరులోని కొండవారివీధిలో నివాసం ఉంటున్న బచ్చు గౌరీనాథ్, అతని భార్య జయశ్రీలు గత ఆదివారం ఇంట్లో ఆహారం తీసుకున్నారు. అప్పటినుంచి ఇద్దరికి వాంతులు, విరేచనాలు అవుతుండగా.. కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ జయశ్రీ (54) మృతి చెందగా.. ఆమె భర్త చికిత్స పొందుతున్నారు. గౌరీనాథ్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాతగుంటూరు సీఐ సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details