గుంటూరు జిల్లా తెనాలిలో సాగునీటి కాలువలో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక వైకుంఠపురం గుడి ఎదురుగా ఉన్న పడమర కాలువలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. కాలువలో నీరు మోకాళ్ళు ఎత్తులో మాత్రమే ప్రవహిస్తుండటం.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మరణించిన మహిళ వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆమెను హత్య చేసి కాలువలో పడేశారా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సాగునీటి కాలువలో మహిళ మృతదేహం.. - గుంటూరు జిల్లా క్రైమ్ తాజా వార్తలు
తెనాలిలోని సాగునీటి కాలువలో మహిళ మృతదేహం కలకలం రేపింది. కాలువలో పెద్దగా నీటి ప్రవాహం లేకపోవటంతో పోలీసులు పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
![సాగునీటి కాలువలో మహిళ మృతదేహం.. Woman dead body in irrigation canal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9883372-297-9883372-1608014204322.jpg)
సాగునీటి కాలువలో మహిళ మృతదేహం