ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేన అభ్యర్థితో బలవంతంగా నామినేషన్ ఉపసంహరణ - మాచర్లలో జనసేన అభ్యర్థి చేత బలవంతంగా నామినేషన్ ఉపసంహరింపజేసిన వైకాపా నాయకులు

మాచర్ల జడ్పీ అభ్యర్థిగా పోటీలో ఉన్న జనసేన అభ్యర్థి బాలు నాయక్​తో.. వైకాపా నాయకులు బలవంతంగా నామినేషన్ ఉపసంహరింపజేశారు. పోటీలో ఎవరూ లేని కారణంగా.. మాచర్ల జడ్పీటీసీ ఏకగ్రీవం కానుంది.

Withdrawal of Nomination by Janasena Candidate in macharla
జనసేన అభ్యర్థి చేత బలవంతంగా నామినేషన్ ఉపసంహరణ

By

Published : Mar 14, 2020, 10:45 PM IST

జనసేన అభ్యర్థి చేత బలవంతంగా నామినేషన్ ఉపసంహరణ

గుంటూరు జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ విషయంలో హైడ్రామా జరిగింది. మాచర్ల జడ్పీటీసీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బాలు నాయక్​తో వైకాపా నాయకులు బలవంతంగా నామినేషన్ ఉపసంహరింపజేశారు. అక్కడ తెదేపా, స్వతంత్రులు ఎవరూ పోటీ చేయలేదు. జనసేన నుంచి బాలూనాయక్ మాత్రమే నామినేషన్ వేశారు. మాచర్ల జడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు అతనిపై ఒత్తిడి తెచ్చారు. మాచర్ల ఎమ్మెల్యే అనుచరులు అతన్ని తమ వాహనంలో ఎక్కించుకుని గుంటూరు జడ్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు.

నామినేషన్ ఉపసంహరణ ముగుస్తున్న సమయంలో బాలూ నాయక్​ని హడావుడిగా ఎన్నికల అధికారుల వద్దకు తీసుకెళ్లారు. అతను నామినేషన్ వెనక్కు తీసుకునేందుకు నిరాకరించాడు. అతనితో బలవంతంగా నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకాలు పెట్టించారు. అనంతరం బయటకి తీసుకొచ్చి వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ తంతుని చూస్తూ అక్కడున్న అధికారులు, పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర వహించారు. మాచర్ల జడ్పీటీసీకి పోటీ లేని కారణంగా.. ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తోంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details