పాత గుంటూరు పోలీసుస్టేషన్ పై దాడి ఘటనలో కేసులను ఉపసంహరిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. పోలీసు స్టేషన్ లో అనధికారింగా చొరబడటంతో పాటు దాడి చేసిన ఘటనలో స్థానిక ముస్లిం యువతపై నమోదైన కేసులను వెనక్కు తీసుకుంటూ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు.
పాత గుంటూరు పోలీసు స్టేషన్ పై 2018లో జరిగిన దాడికి సంబంధించి గతంలో ఆరు కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ కేసుల్లో నిందితులైన వారిపై కేసులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
పోలీసుస్టేషన్‌పై దాడి ఘటనలో కేసుల ఉపసంహరణ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న పదేళ్ల చిన్నారిపై రఘు అనే యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అయితే రఘుని తమకు అప్పగించాలంటూ పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు స్టేషన్ ను ముట్టడించారు. స్టేషన్ పైకి రాళ్లు రువ్వారు. పోలీసుల వాహనాలు ధ్వంసం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. దీంతో ఆందోళనకారులు స్టేషన్ సమీపంలోని వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. అదనపు బలగాలు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. ముస్లింపెద్దలతో పోలీసులు చర్చలు జరిపి నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చి అల్లర్లను నియంత్రణలోకి తెచ్చారు. కానీ అప్పటికే చాలా ఆస్తినష్టం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆందోళనకారులపై మే 18వ తేదిన పోలీసులు 6 కేసులు నమోదు చేశారు. దీనిపై జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో, ముఖ్యమంత్రి అయ్యాక కూడా ముస్లిం మైనార్టీలు జగన్ ని కలిసి కేసులు ఎత్తివేయాలని కోరారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ఇవాళ ఆ కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పోలీసుస్టేషన్‌పై దాడి ఘటనలో కేసుల ఉపసంహరణ ఇదీ చదవండి: ఆర్థిక స్వావలంబన లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు చూశా: సీఎం