లాక్ డౌన్ అమలు అవుతున్నప్పటికీ గుంటూరు జిల్లాలోని గ్రీన్ జోన్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 11 గంటలకు దుకాణాలు తీశారు. అప్పటికే మందుబాబులు దుకాణాల వద్ద పడిగాపులు కాశారు. దుకాణాలు తెరవగానే.. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఎగబడ్డారు.
జిల్లాలోని నాదెండ్ల మండలంలో మద్యం దుకాణాల ముందు జనం గుమిగూడడంపై ఆ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో కరోనా మహమ్మారి భయపెడుతుంటే.. మద్యం దుకాణాల వద్ద ఈ పరిస్థితి మరింత ఆందోళనకు గురి చేస్తుందని ఆవేదన చెందారు.