ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి... జగన్ ఉన్మాదాన్ని అదుపు చేయాలి' - స్థానక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కామెంట్స్

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిచోట్ల విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్ ఉన్మాదాన్ని అదుపు చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. స్థానిక సమరంలో గెలుపు చారిత్రక అవసరమని అభిప్రాయపడ్డారు.

స్థానిక సంస్థల్లో సత్తాచాటి...జగన్ ఉన్మాదాన్ని అదుపు చేయాలి
స్థానిక సంస్థల్లో సత్తాచాటి...జగన్ ఉన్మాదాన్ని అదుపు చేయాలి

By

Published : Mar 5, 2020, 11:04 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు చారిత్రక అవసరమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిషత్తు కోసం భూమినిచ్చి త్యాగం చేసిన రైతులను ఇబ్బంది పెట్టి జగన్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని ఆయన విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల తెదేపాను గెలిపిస్తే జగన్ ఉన్మాదాన్ని అదుపు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. జగన్ ఓ విధ్వంసకారుడని విమర్శించిన చంద్రబాబు... ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్వశక్తులూ ఒడ్డి విజయపతాక ఎగురవేయాసని ఆకాంక్షించారు.

రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు

కేంద్రం చెప్పిన నరేగా నిధులు ఆపేయటంతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు 40 వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. మద్యం కంపెనీలకు చెల్లించడానికి ప్రపంచ బ్యాంకు ఋణం తీసుకోడానికి సిద్ధపడటం అవివేకమని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేని ఆర్థిక దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని మండిపడ్డారు.

విరాళాలు అందజేత

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు నేతృత్వంలో రైతులు, ప్రజలు రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ భవన్​కు వచ్చి చంద్రబాబును కలిశారు. తాము సేకరించిన 1.15 లక్షల రూపాయల విరాళాన్ని ఆయనకు అందజేశారు.

ఇదీ చదవండి:

'రేపు రాజకీయ పార్టీలతో సమావేశం.. ఆ తర్వాతే నోటిఫికేషన్'

ABOUT THE AUTHOR

...view details