రాజధాని ప్రాంత గ్రామాల్లో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామమైన యర్రబాలెంలో రైతులు, మహిళలు 3 రాజధానుల ప్రకటనను నిరసిస్తూ నోటికి నల్ల వస్త్రాలు కట్టుకుని దీక్ష చేపట్టారు. ప్రాణాలు అర్పించైనా... రాజధానిని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం భూములు ఇస్తే....ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో ఇక్కడినుంచి రాజధానిని తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని ఒప్పుకున్న జగన్ ఇప్పుడు విశాఖకు రాజధానిని తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
'ప్రాణాలర్పించైనా...రాజధానిని కాపాడుకుంటాం' - అమరావతి న్యూస్
ప్రాణాలు అర్పించైనా రాజధానిని కాపాడుకుంటామని అమరావతి రైతులు స్పష్టం చేస్తున్నారు. రాజధాని గ్రామమైన యర్రబాలెంలో రైతులు, మహిళలు నోటికి నల్లవస్త్రాలు కట్టుకుని దీక్ష చేపట్టారు.

'ప్రాణాలర్పించైనా...రాజధానిని కాపాడుకుంటాం'