ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సతీమణి లక్ష్మి గుంటూరు జిల్లాలోని కొండవీడు గ్రామాన్ని సందర్శించారు. ఆమెను గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమెల్యే విడదల రజిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కొండవీడు విశిష్టతను ఎమ్మెల్యే ఆమెకు వివరించారు.
కొండవీడును సందర్శించిన ఏపీ ప్రభుత్వ సలహాదారుని సతీమణి - guntur district newsupdates
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సతీమణి లక్ష్మి.. గుంటూరు జిల్లాలోని కొండవీడును సందర్శించారు. ఆమెను చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కొండవీడు చారిత్రక కట్టడాల విశిష్టతను ఎమ్మెల్యే రజిని ఆమెకు వివరించారు.

కొండవీడును సందర్శించిన ఏపీ ప్రభుత్వ సలహాదారుని సతీమణి
కొండవీడు చరిత్రను భావితరాలకు అందించేలా ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని లక్ష్మి అన్నారు. పురాతన కట్టడాలు, గొలుసుకట్ట చెరువులు, ఆలయాలు, మసీదులను ఎమెల్యే విడదల రజినితో కలిసి ఆమె సందర్శించారు. కోట చరిత్ర పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆమెకు బహూకరించారు. కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి, కొత్తపాలెం సర్పంచి వెంకటసుబ్బా రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాచగున్నేరి పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం