గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిగ గ్రామానికి చెందిన చందు.. బేతపూడి గ్రామానికి చెందిన కౌసర్ అనెే మహిళ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఈ నెల 19న గుంటూరులోని నెహ్రు నగర్ శేషాచలం ఆశ్రమంలో వివాహం చేసుకున్నారు. అనంతరం పెద్దల నుంచి తమను రక్షణ కల్పించాలని ఫిరంగిపురం పోలీసులు కోరారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులను పిలిపించి.. మాట్లాడారు. ఇబ్బందులు పెట్టొద్దని నచ్చజెప్పి పంపించారు.
బలవంతగా ఎత్తుకెళ్లారు..
అయితే నవ దంపతులు స్టేషన్ నుంచి బయటకొచ్చి ఆటోలో వెళ్తున్న క్రమంలో యువతి బంధువులు కొందరు తమపై దాడి చేసి నా భార్యను బలవంతంగా ఎత్తుకెళ్లారని చందు పేర్కొన్నారు. యువతిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా చందు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే నాలుగు రోజులు గడుస్తున్నా.. తన భార్య జడ తెలియడం లేదని చందు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భార్యకు ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత వహించాలన్నాడు. నా భార్యను అప్పగించండి.