ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

wife killed husband : కుటుంబ కలహాలు.. క్షణికావేశంలో కఠిన నిర్ణయం.. - గుంటూరు జిల్లాలో క్రైమ్ వార్తలు

క్షణికావేశంలో భార్య భర్తను హత్య చేసింది. కుటుంబ కలహాల కారణంగా విచక్షణ కోల్పోయి రోకలి బండతో దాడి చేసి దారుణంగా హతమార్చింది. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో భార్య నిర్మల.. భర్తపై రోకలి బండతో దాడి చేసింది. ఈ క్రమంలో భర్త మరణించాడు.

wife killed husband
wife killed husband

By

Published : Aug 23, 2021, 3:23 PM IST

గుంటూరు జిల్లా తాడికొండలో కుటుంబ కలహాలతో.. భర్తను భార్య హతమార్చింది. ఈనెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడికొండకు చెందిన రమేష్, నిర్మలకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు. ఐదు సంవత్సరాల నుంచి రమేష్ పక్షవాతంతో బాధపడుతున్నారు.

కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరు ఈనెల 20న మరోసారి గొడవ పడ్డారు. క్షణికావేశంలో భార్య నిర్మల.. భర్తపై రోకలి బండతో దాడి చేసింది. తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే రమేష్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు నిర్మలను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: Capital Amaravathi ISSUE: రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ.. నవంబరు 15కి వాయిదా

ABOUT THE AUTHOR

...view details