గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ యువతిని మాయమాటలు చెప్పి లోబరుచుకున్న అనిల్ అనే వ్యక్తికి.. ఆయన భార్య బుద్ధి చెప్పింది. దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగించింది. పోలీసుల కథనం ప్రకారం... విజయవాడలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని.. అనిల్ వేధించాడు. బెదిరించాడు. భయపడి తన వద్దకు వచ్చిన ఆమెను.. ద్విచక్రవాహనంపై తీసుకెళ్లేందుకు బలవంతంగా ప్రయత్నించాడు. ఇది గమనించిన అతని భార్య... వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు దిశ యాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. వెంటనే అనిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేసి విషయాన్ని తెలుసుకున్నారు. 4 నెలలుగా ఆ విద్యార్థినికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడని గుర్తించారు. కేసు నమోదు చేసి తాడేపల్లికి బదలాయించారు.
దారి తప్పిన భర్త.. బుద్ధి చెప్పిన భార్య
అతనికి పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలూ ఉన్నారు. సంసారం సాఫీగా కొనసాగుతున్న తరుణంలో బుద్ధి మారింది. మరో అమ్మాయిపై అతని కన్ను పడింది. ఆమెను కిడ్నాప్ చేసేంత వరకూ అతని బుద్ధి దారి తీసింది. విషయం భార్యకు తెలిసింది. చివరికి ఏం జరిగింది? అతని భార్య ఏం చేసింది? ఆ బాధితురాలి పరిస్థితి ఏమైంది?
నిందితుడి వివరాలు చెపుతున్న ఎస్సై