ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్తను చంపిన భార్య అరెస్టు - wife murderd husband news

భర్తను హత్య చేసి సహజం మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల చివర్లో తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో జరిగిన హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య, కుమార్తెను అరెస్ట్ చేశారు.

Wife arrested for killing husband in cheyyeru agraharam
Wife arrested for killing husband in cheyyeru agraharam

By

Published : Sep 3, 2020, 9:35 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో గత నెలలో జరిగిన తాపీమేస్త్రీ నరసింహ మూర్తి హత్య కేసులో అతని భార్య, కుమార్తెను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితురాలు బాలామణి.. తన భర్త నరసింహను హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిందని కాట్రేనికోన ఎస్సై జబీర్ తెలిపారు.

ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన బాలామణి.. నాలుగు నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చిందని వెల్లడించారు. నరసింహ మూర్తి రోజూ మద్యం తాగి తనను వేధిస్తున్నాడని... అందుకే చంపేసినట్లు నిందితురాలు వెల్లడించిందని పోలీసులు తెలిపారు. హత్యకు మరేదైనా కారణముందా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details