గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జొన్నలగడ్డ రమేష్(45),నీలిమ దంపతులు మృతి చెందారు. వారి కూతురు అశ్విని(15) స్వల్ప గాయాలతో బయటపడింది. ఆ దంపతులు సింగపూర్ నుంచి 8 రోజుల క్రితమే చెన్నైకి వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని స్వగ్రామం మలకపల్లిలో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఎన్నో ఆశలతో బయలుదేరారు.
పండుగ జరుపుకోవాలని వస్తూ.. మృత్యులోకానికి - గుంటూరు రోడ్డు ప్రమాదాలు
సొంతూరులో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా సంక్రాంతి పండుగ జరుపుకొనేందుకు వెళ్తున్న వారిని మార్గమధ్యంలో మృత్యువు వెంటాడింది. కూతురితో కలసి వెళ్తున్న తల్లిదండ్రులు... కారు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
పండుగ జరుపుకోవాలని వస్తూ.. మృత్యులోకానికి
చినకొండ్రుపాడు వద్ద ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొనడంతో.... కారు పల్టీ కొట్టింది. కారులోనుంచి మంటలు చెలరేగాయి. దంపతులు మృతిచెందగా... వారి కుమార్తె అశ్విత ప్రమాదం నుంచి బయట పడింది. చిన్నారి అశ్విని కాటూరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:గురజాల సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి