ఏపీలోని గుంటూరు జిల్లా నిడబ్రోలుకు చెందిన అవినాష్‌కు వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ప్రణతితో ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వారిద్దరూ రంగారెడ్డి జిల్లా పేట్ బషీరాబాద్ పరిధిలోని పద్మానగర్‌లో నివాసముంటూ గచ్చిబౌలిలోని స్మాక్ ఎంటర్‌ప్రైజెస్‌లో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్నారు.
లావాదేవీల్లో తేడాలే కారణమా?
ఇటీవల ఈ సంస్థ లావాదేవీల్లో తేడాలు రావడం వల్ల అవినాష్ దంపతులను యాజమాన్యం నిలదీసింది. ఈ నెల 9న లెక్కలన్నీ అప్పగిస్తామని యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేట్ బషీరాబాద్ సీఐ మహేశ్ తెలిపారు.