ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్తగారి ఇంటి ముందు పడిగాపులు.. ఎందుకంటే..? - latest guntur news

కట్టుకున్నవాడు కాలం చేశాడు.. అక్కున చేర్చుకుని అండగా నిలవాల్సిన అత్త ఇంటికి తాళం వేసి వెళ్లి పోయింది... దిక్కులేని స్థితిలో ఓ మహిళ చంటి పిల్లలతో రాత్రి నుంచి అత్తగారింటి ముందే బిక్కు బిక్కు మంటూ కూర్చింది.

guntur district
అత్తగారి ఇంటి ముందు పడిగాపులు..ఏమైందంటే?

By

Published : Jun 16, 2020, 3:39 PM IST

గుంటూరు చుట్టుగుంటలో ఓ మహిళ అత్తగారింటి ఎదుట ఆందోళన చేపట్టింది. పిడుగురాళ్లకు చెందిన అనూషకు ఎనిమిదేళ్ల క్రితంగుంటూరు చుట్టుగుంటకు చెందినక్రాంతి కుమార్​తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది డిసెంబరు నెలలోక్రాంతి కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలోచిన్నపిల్లలతో ఉన్న అనూష పిడుగురాళ్లలోని తల్లిగారింటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి ఇంటికి రాగా అత్త రాములమ్మ ఇంట్లోకి రాకుండా తాళం వేసి కూతుర్లు వద్దకు వెళ్లింది. సోమవారం రాత్రి నుంచి అనూష అత్త ఇంటి ఎదుట నెలల చిన్నారిని పెట్టుకొని కూర్చుంది. స్థానికులు ఆమెకు ఆహారం అందించారు. తన భర్త చనిపోయిన తరువాత తనకుంటూ మిగిలింది ఆ ఇల్లే అని..., తన అత్తను చూసుకుంటూ ఆ ఇంటిలోనే ఉంటానంటూ అనూష వాపోయింది. అయితే ఇంటి కోసం అత్త రాములమ్మ , అతని అల్లుడు మురళి కలసి పథకం ప్రకారం ఇంటికి తాళం వేసి వెళ్లారని స్థానికులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details