రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు చేర్చలేదని కాంగ్రెస్ నేతలనురాష్ట్ర భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. గుంటూరులో మేధావులతో కేంద్రమంత్రి జావడేకర్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రఅంటూ ఉద్యమాలు చేసిన కొందరు... ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు.రాష్ట్ర మంత్రులతో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన జైరామ్ రమేశ్.. అదే అంశాన్నిబిల్లులో పెట్టకపోవటానికి గల కారణం చెప్పాలన్నారు. కేంద్ర పథకాలనురాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందనివిమర్శించారు. అనంతపురంలో కియా మోటార్స్ సంస్థ.. మేకిన్ ఇండియాలో భాగంగానే కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి చంద్రబాబు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు.
బిల్లులో ఎందుకు పెట్టలేదు - kanna laxmi
ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన జైరాం రమేశ్.. ఆ విషయాన్ని విభజన బిల్లులో ఎందుకు పెట్టలేదని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నిలదీశారు.
కన్నా లక్ష్మీ నారాాయణ