ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్​ బియ్యం అందక లబ్ధిదారుల ఇబ్బందులు - ration card problems news in bapatla

గుంటూరు జిల్లా బాపట్లలో రేషన్​ బియ్యం అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం నిల్వలు నిండుకున్నాయని.. వచ్చిన తర్వాత వెంటనే సరఫరా చేస్తామని రేషన్​ దుకాణాల సిబ్బంది తెలిపారు.

బాపట్లలో రేషన్​ బియ్యం అందక లబ్ధిదారుల ఇబ్బందులు
బాపట్లలో రేషన్​ బియ్యం అందక లబ్ధిదారుల ఇబ్బందులు

By

Published : Apr 19, 2020, 2:18 PM IST

గుంటూరు జిల్లా బాపట్లలో రేషన్​ బియ్యం పంపిణీ ప్రహసనంగా మారింది. పట్టణంలోని 24వ వార్డులో బియ్యం నిల్వలు లేక చౌక దుకాణం సిబ్బంది చేతులెత్తేశారు. ఉదయం నుంచే దుకాణాల వద్ద వ్యక్తిగత దూరం పాటిస్తూ బారులు తీరుతున్నా.. తమను పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం నిల్వలు నిండుకున్నాయని.. సరుకు రాగానే పంపిణీ చేస్తామని దుకాణాల నిర్వాహకులు బదులిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details