మహిళలపై అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిని 21 రోజుల్లోగా శిక్షించాలంటూ గుంటూరులో తెదేపా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఇంకా శిక్ష వేయకపోవడాన్ని తప్పుబట్టారు. దిశ చట్టం పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప..వైకాపా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించుకుంటామంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహించారు. జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ఆరోపించారు.
Candle Rally: 'దిశ పేరుతో ప్రచారం..ప్రజలకు వైకాపా చేసిందేమీ లేదు' - తెదేపా కొవ్వొత్తుల నిరసన
దిశ చట్టం పేరుతో వైకాపా మోసగిస్తోందని తెదేపా నేతలు విమర్మించారు. మహిళలపై అత్యాచారాలు, దాడులకు పాల్పడే వారిని 21 రోజుల్లోగా శిక్షించాలంటూ గుంటూరులో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
దిశ చట్టం అమలేది...??
స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం అడిగే వారిపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రమ్య హత్య కేసులో నిందితుడికి వెంటనే శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: PK birthday: పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుకల్లో కానిస్టేబుళ్లు..కానీ