పశ్చిమబంగా నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని గుంటూరు లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 94,920 విలువ గల 144 మద్యం సీసాలను, ఓ లారీని స్వాధీనం చేసుకున్నట్లు లాలాపేట సీఐ ఫిరోజ్ తెలిపారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ముందస్తు సమాచారం మేరకు ఏటుకూరు బైపాస్ వద్ద పోలీసులు తనఖీలు చేశారు. చీపుర్ల లోడ్‌తో వెళుతున్న లారీని సోదా చేయగా... అడుగు భాగాన పశ్చిమబంగాకు చెందిన మద్యం ఉన్నట్లు గుర్తించారు.
లారీలో అక్రమ మద్యం తరలింపు పట్టివేత.. వ్యక్తి అరెస్ట్ - గుంటూరు జిల్లా అక్రమ మద్యం తాజా వార్తలు
పశ్చిమబంగా నుంచి అక్రమ మద్యం తరలిస్తున్న ఓ లారీని ఏటుకూరు బైపాస్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న 144 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమబంగా నుంచి అక్రమ మద్యం తరలిస్తున్న లారీ స్వాధీనం