అమరావతి నుంచి రాజధాని తరలించడం వలన యువత ఉపాధి అవకాశాలను కోల్పోతుందని.. అమరావతి రాజకీయేతర ఐకాస సభ్యులు డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. రాజధాని తరలి వెళ్లపోవటంతో కలిగే అనర్ధాలను వివరిస్తూ.. 3వేల మంది యువతతో ఈనెల 20న వెబినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని గత 302 రోజులు నుంచి రైతులు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. అమరావతి ఉద్యమాన్నిహేళన చేస్తూ మాట్లాడిన వైకాపా నేతలకు.. 300 రోజు ఉద్యమం కనువిప్పు కల్గించిందన్నారు.
రాజధాని తరలింపు అనర్థాలపై.. ఈనెల 20న వెబినార్
రాజధాని తరలివెళ్తే కలిగే అనర్థాలపై ఈ నెల 20 న 3వేల మంది యువతతో వెబినార్ నిర్వహించనున్నట్లు అమరావతి రాజకీయేతర ఐకాస సభ్యులు డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. రాజధాని తరలింపుతో యువత ఉపాధి కోల్పోతారని శైలజ అన్నారు.
రాజధాని తరలి వెళితే యువత భారీగా నష్టపోతోందని.. ఆ నష్టాన్ని వివరిస్తూ ఈనెల 20న వెబ్ నార్ నిర్వహిస్తున్నామని రాయపాటి శైలజా తెలిపారు. 22 న భారీ పాదయాత్ర.. దసరా ఉత్సావాల అనంతరం అన్ని నియోజకవర్గాల్లో మహిళలతో బస్ యాత్ర చేపడతామని చెప్పారు. జిల్లా లోని అన్ని మండల కేంద్రాల్లో పర్యటించి అమరావతి నుంచి రాజధాని తరలిస్తే వచ్చే నష్టాలను ప్రజలకి వివరిస్తామని చెప్పారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని శైలజ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కుండపోత వానలు... లక్షల ఎకరాల్లో మునిగిన పంటలు