రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలలో పనిచేసే కార్మికులకు సైతం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అమలు చేయాలని సహకార సంఘం ప్రతినిధులు కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐఐసీ పార్కులో మంత్రి గౌతమ్‌రెడ్డితో కృష్ణా జిల్లా పెడనకు చెందిన చేనేత సహకార సంఘం నేతలు సమావేశమయ్యారు. నేతన్న నేస్తం పథకం కేవలం మగ్గం నేసే వాళ్లకే అమలు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
సహకార సంఘాలలోని చేనేత కార్మికులకూ 'నేతన్న నేస్తం' వర్తింపజేయాలి - చేనేత కార్మికుల కష్టాలు
చేనేత సహకార సంఘాలలో పనిచేసే కార్మికులకూ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం వర్తింపజేయాలని మంత్రి గౌతమ్ రెడ్డిని సహకార సంఘం నేతలు కోరారు. సహకార సంఘాల రుణాలు మాఫీ చేయాలని కోరారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి గౌతమ్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
గౌతమ్ రెడ్డిని కలిసిన సహకార సంఘం నేతలు
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహకార సంఘాలకు రుణాలను మాఫీ చేశారని మంత్రికి తెలిపారు. తమకూ ఈ సారి రుణాలు మాఫీ చేయాలని, నేతన్న నేస్తం పథకం వర్తింపచేయాలని కోరారు. సహకార సంఘాల ద్వారా నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చూడాలని మంత్రిని కోరారు. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం లేదు: పిల్లి సుభాష్ చంద్రబోస్