ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దక్షిణ అండమాన్​లో అల్పపీడనం.. మూడు రోజుల్లో తుపాను - తుపానుగా మారే సూచనలు

STORM ALERT: దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది 8వ తేదీ ఉదయానికి తుపానుగా మారే సూచనలు ఉన్నట్టు పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ కోస్తాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

weather
వాతావరణ సమాచారం

By

Published : Dec 5, 2022, 7:15 PM IST

Weather Update in AP: దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం తెలియజేసింది. క్రమంగా ఇది వాయువ్య దిశగా కదులుతూ బలపడి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. ఇది మరింతగా బలపడుతూ 8వ తేదీ ఉదయానికి తుపానుగా మారే సూచనలు ఉన్నట్టు పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడులోని ఉత్తర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.

8వ తేదీ నుంచి రెండు రోజుల పాటు దక్షిణ కోస్తాలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ కోస్తాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details