ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దుగ్గిరాల ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంటాం: ఆళ్ల - MLA RK Comments on chandrababu

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను గెలుచుకొని ముఖ్యమంత్రి జగన్​కు కానుకగా ఇస్తామని.. మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తామని తెదేపా అధ్యక్షులు చంద్రబాబు ప్రకటించినా.. దుగ్గిరాలలో ఆ పార్టీ నేతలు ఆయన మాటను ధిక్కరించి పోటీకి దిగుతామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇన్​ఛార్జ్​గా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలోనే అధినేత మాటకు విలువ లేదా అని ప్రశ్నించారు. స్థానిక నేతలకు విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఆళ్ల రామకృష్ణారెడ్డి

By

Published : Apr 3, 2021, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details