ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శ్రీకృష్ణుని అండతో అమరావతి రణక్షేత్రంలో గెలిచి తీరుతాం' - ap amaravathi news

కృష్ణాష్టమిని పురస్కరించుకుని తుళ్లూరులో మహిళలు దీక్షా శిబిరంలో పూజలు చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మరోమారు డిమాండ్ చేశారు. ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్రంలో పాండవులే విజయం సాధించినట్లు.. కలియుగంలో జరుగుతున్న అమరావతి రణక్షేత్రంలోనూ గెలిచి తీరుతామని రైతులు స్పష్టం చేశారు.

తుళ్లూరులో మహిళలు దీక్ష
తుళ్లూరులో మహిళలు దీక్ష

By

Published : Aug 11, 2020, 2:42 PM IST

Updated : Aug 12, 2020, 5:51 PM IST

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రైతులు, మహిళలు 238 వ రోజున.. రాజధాని పరిరక్షణ కోసం దీక్షను కొనసాగించారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని దీక్షా శిబిరంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్​కు ఏ గతి పడుతుందో భారతీయ జనతా పార్టీ విషయంలోనూ అదే పునరావృతం అవుతుందని మహిళలు తేల్చిచెప్పారు.

' శ్రీకృష్ణుని అండతో అమరావతి రణక్షేత్రంలో గెలిచి తీరుతాం'
' శ్రీకృష్ణుని అండతో అమరావతి రణక్షేత్రంలో గెలిచి తీరుతాం'
' శ్రీకృష్ణుని అండతో అమరావతి రణక్షేత్రంలో గెలిచి తీరుతాం'

ప్రభుత్వ న్యాయవాదులు ఉండగా లక్షల రూపాయలతో ప్రైవేటు న్యాయవాదులను నియమించుకోవడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్​కు సొంత న్యాయవాదులపై నమ్మకం లేదన్నారు. అందుకే ప్రైవేటు లాయర్లతో న్యాయస్థానాల మెట్లెక్కారని అన్నారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో ఈ పోరాటంలో విజయం సాధిస్తామని రైతులు తేల్చి చెప్పారు.

' శ్రీకృష్ణుని అండతో అమరావతి రణక్షేత్రంలో గెలిచి తీరుతాం'
Last Updated : Aug 12, 2020, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details