గుంటూరు జిల్లా కాకుమానులలో జిల్లా అభివృద్ధిపై అధికారులతో హోమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె పేర్కొన్నారు. 60 సంవత్సరాలు దాటి అర్హులై ఉంటే కుటుంబం లో ఎంతమంది వున్నా...అందరికి పింఛన్ ఇస్తామన్నారు. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులైన వారందరికీ గ్రామ వాలంటీర్ల ద్వారా...సంక్షేమ పథకాలు చేరువేస్తామని తెలిపారు.
ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకుంటాం : హోమంత్రి - Home minister
పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యనించారు. గుంటూరు జిల్లా కాకుమానులలో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
హోమంత్రి