ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాచర్ల దాడి ఘటనపై సీబీఐ విచారణ కోరుతాం' - తెదేపా నేతలపై దాడి ఘటన

మాచర్ల ఘటనపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తెదేపా నేత బొండా ఉమ తప్పుబట్టారు. నిందితులను వదిలేసి తమ కాల్ డేటాపై దర్యాప్తు చేస్తామని డీజీపీ అనటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్​షా దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

bonda uma
bonda uma

By

Published : Mar 15, 2020, 10:48 AM IST

మీడియాతో బొండా ఉమ

గుంటూరు జిల్లా మాచర్ల దాడి ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతామని తెలుగుదేశం నేత బొండా ఉమ తెలిపారు. వైకాపా నేతల దాడికి నిరసనగా... 72 గంటల నిరసన దీక్ష చేస్తానని బొండా ఉమ ప్రకటించారు. మాచర్ల ఘటనపై డీజీపీ వ్యవహరిస్తున్న తీరు విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. నిందితులను వదిలేసి తమ కాల్‌డేటా దర్యాప్తు చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాన్ని త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ప్రశాంతంగా ఉన్న ఏపీని మరో బిహార్​లా మార్చారని విమర్శించారు. గతంలో తాము ఇలానే దాడులు చేస్తే ప్రతిపక్ష నేతలు రోడ్లపై తిరగగలిగేవారా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details